చాలామంది పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వాటిని తింటారు, కానీ కొన్ని సందర్భాల్లో వాటినే తినకపోవడమే మంచిది. పుట్టగొడుగులతో రకరకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టగొడుగుల్లో ఎక్కువ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ కూడా పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. పుట్టగొడుగులను తినడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు పుట్టగొడుగులని తినడం వలన మంట, వాపు వంటి సమస్యలు నయమవుతాయి. వీటిని అన్ని సీజన్స్లో తినొచ్చు, కానీ వానకాలంలో తినకుండా ఉండడమే మంచిది.
వానకాలంలో పుట్టగొడుగులు ఎందుకు తినకూడదు, దాని వలన ఎలాంటి నష్టం వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. వానకాలంలో పుట్టగొడుగులను తినడం వలన సమస్యలు వస్తాయి. వానకాలంలో నేలపై ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. వానలు పడటం వల్ల పుట్టగొడుగులు పుడతాయి. వాటిలో ఎన్నో రకాలు ఉంటాయి, విషపూరితమైనవి కూడా ఉంటాయి. తడి నేలలో ఫంగస్ కలుగుతుంది, దాంతో బ్యాక్టీరియా కూడా ఎక్కువవుతుంది. ఇలాంటి సమయంలో పుట్టగొడుగులను తిన్నట్లయితే అలర్జీలు, జ్వరం, అనారోగ్య సమస్యలు వ్యాపించే అవకాశం ఉంది.
పుట్టగొడుగులు కొన్ని రకాలు వర్షాకాలంలో పుడతాయి. వీటిని తినడం వలన హెల్త్ దెబ్బతింటుంది. కొన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. అలాంటివి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. తినే వాటిలా కనపడతాయి, కానీ వీటి వలన ఎంతో నష్టం ఉంటుంది. విషపూరితమైన పుట్టగొడుగుల వలన అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎలర్జీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగులు తినకుండా ఉంటేనే మంచిది.