పుష్ప రూట్ లో ప్రభాస్… రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

-

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో డార్లింగ్ ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్ మాళవిక మోహన్, మరో నటి నిధి అగర్వాల్, రిద్దికుమార్‌లు నటిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించింది చిత్ర బృందం. ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ అయింది.

TheRajaSaabOnDec5th
TheRajaSaabOnDec5th

ఈ సినిమాను డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అలాగే ఈ నెల 16వ తేదీన ఉదయం పది గంటల 52 నిమిషాలకు… సినిమా టీజర్ కూడా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప రెండు పార్టీలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. అందుకే రాజా సాబ్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news