ఆరెంజ్ మూవీ హీరోయిన్ షాజన్ పదమ్సీ వివాహం చేసుకున్నారు. ఆశిష్ కనకియా అనే వ్యక్తిని షాజన్ పదమ్సీ ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. “మూవీ మాక్స్” కంపెనీకి సీఈఓ గా ఆశిష్ కనకియా వ్యవహరిస్తున్నారు. జనవరి నెలలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కాగా రేపు ముంబైలో రిసెప్షన్ జరగనుంది.

ఈ రిసెప్షన్ కి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ విచ్చేయనున్నారు. కాగా షాజన్ పదమ్సీ ప్రస్తుతం సినిమాలలో, మరోవైపు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. తెలుగు హిందీలో అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో మసాలా, ఆరెంజ్ లాంటి సినిమాలలో నటించింది. హిందీలో హౌస్ ఫుల్ 2, పగల్ పాన్ నెక్స్ట్ లెవెల్, సాలిడ్ పటేల్స్ లాంటి అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక షాజన్ పదమ్సీ అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.