తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన నిర్మాత సునీల్ నారంగ్… నేను 07.06.2025న వరుసగా మూడవసారి ఎన్నికయ్యానన్నారు. నా పేరు నాకు ఎలాంటి సంబంధం లేని పబ్లిక్ స్టేట్మెంట్లతో బలవంతంగా ముడిపడి ఉన్నందున నేను ఈ పదవి నుండి వైదొలగుతున్నానని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధించి జారీ చేయబడిన పబ్లిక్ స్టేట్మెంట్లు/ఇంటర్వ్యూ/ప్రెస్ మీట్లు చేసే ముందు నన్ను సంప్రదించలేదు…నా ప్రమేయం లేని చర్యలు లేదా వ్యాఖ్యలకు నేను ఎలాంటి బాధ్యత వహించను అంటూ వెల్లడించారు. ఈ పరిస్థితులలో, నా పాత్రను కొనసాగించడం నాకు కష్టంగా ఉందన్నారు. నాకు తెలియకుండా లేదా అనుమతి లేకుండా చేసిన ప్రకటనలతో నా పేరు లేదా నా ఖ్యాతిని ముడిపెట్టడానికి నేను అనుమతించలేను…అందువల్ల, నేను తక్షణమే నా రాజీనామాను సమర్పిస్తున్నానని ప్రకటించారు సునీల్ నారంగ్. ఈ లేఖను నా రాజీనామాకు అధికారిక నోటీసుగా అంగీకరించి, సంస్థ సజావుగా పనిచేయడానికి తగిన వారసుడిని నియమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఛాంబర్‌ను గౌరవంగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు.