బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ అవకాశం తనకే వస్తుందని భావించిన వర్మ నిరుత్సాహ పడ్డాడు. అయితే ఆ కసి మీదనే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమా పోస్టర్ తో హడావిడి చేశాడు. అప్పట్లో కాస్త హంగామా చేసిన వర్మ ఈమధ్య సైలెంట్ గా ఉన్నాడు. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా రావడం. రెండు రోజులకో పోస్టర్ రిలీజ్ చేయడంతో మళ్లీ వర్మకు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మీద గాలి మళ్లినట్టు ఉంది.
ఇక లేటెస్ట్ గా అక్టోబర్ 18న దసరా కానుకగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ముహుర్తం అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అంతేకాదు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి ఎంట్రీ ముందు వరకు సినిమా ఉంటుంది. తన సినిమా లక్ష్మి పార్వతి ఎంట్రీ తర్వాత అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను 2019 జనవరి చివర్లో రిలీజ్ చేస్తానని కూడా అన్నడు.
జివి ఫిలిమ్స్ బ్యానర్ లో రాకేష్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిపాడు. మరి సడెన్ గా వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మీద పడ్డాడేంటని అందరు షాక్ అవుతున్నారు. మిగతా డీటైల్స్ అక్టోబర్ 19న తిరుపతిలో జరిగే ప్రెస్ మీట్ లో చెబుతా అంటూ ట్వీట్ ముగించాడు వర్మ.
NTR will end before Lakshmi Parvathi has entered into his life and my LAKSHMI’s NTR will start with her entering into his life
GV FILMS is presenting along with Rakesh Reddy producing pic.twitter.com/FdFcCM8NQY
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2018
Thrilled that we are launching LAKSHMI’s NTR on Vijayadashami and the film will be released END of JANUARY
DETAILS to be given at a PRESS MEET ON 19 th OCTOBER AT THIRUPATHI #NTRTRUESTORY pic.twitter.com/qBxYiFlCso— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2018