నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా సమంత తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతోంది. కాగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. స్వేచ్ఛను పొందడమే విజయం అంటూ అన్నారు. గత రెండేళ్లుగా తన సినిమా రిలీజ్ కాలేదని ఈ సమయంలో తాను చాలా స్వేచ్ఛగా ఉన్నానని సమంత అన్నారు.

నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ ప్రస్తుతం నేను విజయం సాధించలేదని అనుకుంటున్నారు. గతంలో కన్నా నేను ఇప్పుడే ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతున్నాను అని సమంత అన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న పనులు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని, ఉత్సాహాన్ని అందిస్తున్నాయని సమంత అన్నారు. వాటిని పూర్తి చేయడం కోసమే ఆనందంగా నిద్రలేస్తున్నానని సమంత వెల్లడించారు. ప్రస్తుతం సమంత షేర్ చేసుకున్న ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.