WTC Final 2025: 27 ఏళ్ళ కల… WTC ఛాంపియన్ గా దక్షిణాఫ్రికా

-

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా దక్షిణ ఆఫ్రికా నిలిచింది. లండన్ లోని లార్డ్స్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సౌత్ ఆఫ్రికా… ఛాంపియన్గా నిలిచింది. ఆస్ట్రేలియాపై ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది దక్షిణాఫ్రికా.

wtc
SA vs AUS Day 4 South Africa script history, ICC champions after 27 years

282 పరుగుల లక్ష్యాన్ని… ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది సౌత్ ఆఫ్రికా. ఈ నేపథ్యంలోనే 27 సంవత్సరాల తర్వాత… రెండో ఐసీసీ టైటిల్ గెల్చుకుంది దక్షిణాఫ్రికా. 1998లో ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news