టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త లుక్ తో మెరిసిపోతున్నారు. నిన్న సాయంత్రం జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలలో శర్వానంద్ క్లీన్ షేవ్ చేసుకొని హ్యాండ్సమ్ గా కనిపించారు. శర్వానంద్ ను ఈ లుక్ లో చూసిన వారందరూ మరేదైనా కొత్త సినిమా కోసం కావచ్చని చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం శర్వానంద్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ సినిమాలో హీరోగా చేస్తున్నారు. కాగా, హీరో శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ (2014) సినిమాకు గాను ఉత్తమ చిత్రంగా పురస్కారం భరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హీరో శర్వానంద్ అవార్డును అందుకున్నారు. హీరో శర్వానంద్ తో పాటు మరికొంతమంది హీరోలు గద్దర్ అవార్డులను అందుకున్నారు.