తేనెటీగలు కుట్టిన తర్వాత కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

-

తేనెటీగలు ఎంతో ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. అయితే తేనెటీగలు కుట్టినప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. తేనెటీగలు ఉండేటువంటి ప్రదేశాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తేనెటీగ కుట్టిన వెంటనే సురక్షితమైన ప్రదేశానికి తప్పకుండా వెళ్లాలి మరియు కుట్టకుండా జాగ్రత్తపడాలి. ముందుగా తేనెటీగలు కుట్టినప్పుడు చర్మం పై ముళ్ళు ఉంటుంది. దాన్ని వెంటనే తీసేయడం ఎంతో అవసరం. ఎప్పుడైతే చర్మం లోపలికి ముళ్ళు దిగుతుందో ఎంతో ప్రమాదకరం మరియు అటువంటి సందర్భాలలో ముళ్ళును అసలు ముట్టుకోకూడదు. వెంటనే డాక్టర్ ను సంప్రదించి దాన్ని తీయించాలి.

తేనెటీగలు కుట్టిన వెంటనే సోపు మరియు నీళ్లను ఉపయోగించి ఆ ప్రాంతంలో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తేనెటీగలు కుట్టిన దగ్గర ఐస్ ముక్కలు లేక ఐస్ ప్యాక్ ను ఉపయోగించి పెట్టడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఐస్ ప్యాక్‌ ను 15 నుండి 20 నిమిషాల వరకు ఉంచడం వలన తేనెటీగలు కుట్టిన వెంటనే వచ్చే మంట నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. తేనెటీగలు కుట్టినప్పుడు చర్మం పై ముళ్ళు తీసి ఆ ప్రాంతంలో బేకింగ్ సోడాతో కలిపిన నీళ్లను పెట్టాలి. ఈ విధంగా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా కుట్టిన ప్రాంతంలో అలోవెరా జెల్‌ను రాయడం వలన చాలా ఉపశమనాన్ని పొందవచ్చు.

సహజంగా ఎటువంటి పురుగులు కుట్టిన చర్మాన్ని గోళ్లతో గీరడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా తేనెటీగలు కుట్టిన ప్రాంతాన్ని కడిగిన తర్వాత గోళ్లను అసలు ఉపయోగించకూడదు. గోళ్లను ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో తేనెటీగలు కుట్టిన తర్వాత ఎలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు, నాలిక తడి ఆరిపోవడం, శ్వాసకోశ సమస్యలు, వాపు, వికారం, పెదవులు ఉబ్బడం వంటి లక్షణాలు కనబడతాయి. అటువంటి లక్షణాలు కనిపించిన సందర్భాలలో కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి మరియు సూచనలను తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news