Basavatarakam Cancer Hospital Silver Jubilee Celebrations: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా పైలాన్ ను ఆవిష్కరించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ. ఈ సందర్బంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ… మా అమ్మ బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభమైందని పేర్కొన్నారు.

ఎంతో మంది దాతలు మంచి సంకల్పంతో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారని వెల్లడించారు బాలయ్య. ముఖ్యంగా మాకు సహకరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు బాలకృష్ణ.