ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలవరీ బాయ్ అత్యాచారయత్నం చేసాడు. చెన్నైలో జెప్టో యాప్‌లో మడిపాక్కంకు చెందిన ఐటీ ఉద్యోగిని ఆర్డర్ చేసాడు. మహిళ ఆర్డర్ చేసిన వస్తువులను డెలవరీ చేసాడు గోపినాథ్ అనే డెలవరీ బాయ్. సెల్‌ఫోన్‌లో చార్జింగ్ లేదని, కాసేపు చార్జింగ్ పెట్టాలని కోరడంతో డెలవరీబాయ్‌ని ఇంట్లోనికి అనుమతించింది సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారయత్నం చేసాడు గోపినాథ్ అనే డెలవరీ బాయ్. యువతి గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు డెలివరీ బాయ్. దీంతో పోలీసులను అశ్రయించింది బాధిత మహిళ. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి డెలివరీ బాయ్ గోపీనాథ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.