వానాకాలం రైతు భరోసా డబ్బుల జమ పూర్తయినట్లుగా తెలంగాణ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నిన్న 15 ఎకరాల కన్నా ఎక్కువ సాగు భూములు ఉన్నవారి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసింది. మొత్తం 69. 39 లక్షల మంది రైతులకు చెందిన కోటి 46 లక్షల ఎకరాలకు గాను రూ. 8744.13 కోట్లు రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే ఇప్పటి వరకు రైతులకు ఎవరికైనా డబ్బులు అకౌంట్లలో జమ కానట్లయితే వారి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా…. వర్షాకాలం రైతు భరోసా నిధులను గత కొన్ని రోజులుగా విడుదల చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది.