అంజలిని చంపడం కరెక్టే : నిందితుడి తల్లి

-

తెలంగాణ రాష్ట్రంలో జీడిమెట్లలో అంజలి హత్య సంచలనం సృష్టించింది. అంజలిని ఆమె కుమార్తె, బాయ్ ఫ్రెండ్ కలిసి చంపారు. వారి ప్రేమకు అడ్డు వస్తుందన్న కారణంతోనే అంజలి తన తల్లిని చంపేందుకు ప్లాన్ వేసింది. వేసిన ప్లాన్ ప్రకారం అంజలిని చంపారు. దీంతో అంజలి కుమార్తెను ఆమె బాయ్ ఫ్రెండ్ తో సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనపై తాజాగా నిందితుడు శివ తల్లి సంచలన వాక్యాలు చేసింది. అంజలిని ఆమె కూతురు చంపడంలో ఎలాంటి తప్పులేదు. నా కొడుకును ఆ అమ్మాయిని ప్రేమించడం అంజలికి నచ్చలేదు. దీంతో ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం మా అబ్బాయితో వచ్చేసి మా ఇంట్లోనే ఉంది. దీంతో అంజలి మా కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అందుకే అంజలి అంటే మాకు నచ్చలేదు. రెండు రోజులలో నా కొడుకును బెయిల్ మీద బయటకు తెచ్చుకుంటానంటూ నిందితుడు తల్లి సంచలన కామెంట్లు చేసింది. కాగా తల్లి అంజలిని కూతురు, ప్రియుడు శివ, ఆయన తమ్ముడు చున్నీతో బిగించి చంపారు. శివతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమకు దారితీసింది.

Read more RELATED
Recommended to you

Latest news