మీ స్మార్ట్ ఫోన్ తొందరగా వేడెక్కుతోందా? అయితే ఇలా చేయండి..!

-

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం చాలా ఎక్కువ అయ్యింది అనే చెప్పవచ్చు. అయితే చాలా శాతం మంది స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు, స్మార్ట్‌ఫోన్ ఎంతో తొందరగా వేడి ఎక్కుతుంది అని భావిస్తూ ఉంటారు. అయితే ఇది ఎంతో ప్రమాదకరం. దానిని తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి. ఎప్పుడైతే మొబైల్ ఫోన్ లో ఉండే ప్రాసెసర్‌ పై భారం ఎక్కువగా ఉంటుందో, స్మార్ట్‌ ఫోన్ వేడెక్కుతుంది. ఎప్పుడైతే ఎటువంటి విరామం లేకుండా ఫోన్‌ ను ఉపయోగిస్తారో, ఈ విధంగా జరుగుతుంది.

ఎప్పుడైతే ఫోన్ వేడిగా అవుతుందో, ముందుగా ఫోన్ బ్యాక్ కవర్‌ ను తీయాలి. అంతేకాకుండా ఫోన్ లో ఉపయోగించని ఆప్షన్ల ను ఆఫ్ చేయాలి. బ్లూటూత్, లోకేషన్ వంటి మొదలైన ఫీచర్ల ను ఆఫ్ చేయడం ఎంతో అవసరం. మొబైల్ ఫోన్ వినియోగించేటప్పుడు ప్లే స్టోర్, యాప్ స్టోర్ వంటి స్టోర్ల ను మాత్రమే ఉపయోగించి యాప్ లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇతర లింకులను ఓపెన్ చేసి అప్లికేషన్ లను డౌన్లోడ్ చేయడం వలన ఎంతో ప్రమాదం. అంతేకాకుండా, ఫోన్‌ లో అనవసరమైన హై గ్రాఫిక్ గేమ్స్ లేదా యాప్స్‌ను ఉపయోగించకూడదు.

వాటి వలన ప్రాసెసర్‌ పై ఒత్తిడి పడుతుంది. దీంతో ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్‌ ను సూర్య రశ్మి తగిలే విధంగా ఉపయోగిస్తారో, ఫోన్ ఎంతో త్వరగా వేడెక్కుతుంది. కనుక సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి. ఫోన్ ఉపయోగించేటప్పుడు ఎక్కువ అప్లికేషన్ లను ఓపెన్ చేసి వదిలేయడం వలన, బ్యాక్‌ గ్రౌండ్‌లో అవి రన్ అవుతూ ఉంటాయి. దాని వలన ఫోన్ వేడి ఎక్కుతుంది. కనుక ఎటువంటి స్మార్ట్‌ ఫోన్‌ ను ఉపయోగించినా, ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలి. ఇలా చేయడం వలన స్మార్ట్‌ ఫోన్ వేడి ఎక్కకుండా ఉంటుంది. కనుక ఇటువంటి పొరపాట్లను చేయకుండా, ప్రాసెసర్‌ పై భారం పడకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news