జీవితంలో అదృష్టాన్ని పెంచుకోవాలంటే.. ఈ ఫోటోను మీ ఇంట్లో పెట్టాల్సిందే..!

-

చాలా శాతం మంది వాస్తు నియమాలను ఎక్కువగా పాటించరు. కొన్ని సందర్భాలలో మాత్రమే వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యతను ఇస్తారు. ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తారు. అదే విధంగా జీవితంలో వాస్తు శాస్త్రాన్ని పాటించడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. సహజంగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వలన ఎంతో అదృష్టాన్ని పొందవచ్చు అని వాస్తు నిపుణులు చెబుతారు. అదే విధంగా ఇంట్లో ఏడు గురాళ్ల ఫోటో ను పెట్టుకుంటే ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఏడు అనేది ఎంతో అదృష్ట సంఖ్యగా వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది.

ఎప్పుడైతే ఇంట్లో ఏడు గుర్రాల ఫోటో ను పెడతారో, వాస్తు బలం చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తు పరంగా ప్రయోజనాన్ని పొందాలంటే తప్పకుండా ఏడు గుర్రాల ఫోటో ను ఇంట్లో పెట్టాల్సిందే. పరిగెత్తే ఏడు గురాళ్ల ఫోటోను ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఈ విధంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా ఇంట్లో ఉండే దక్షిణ గోడ పై ఈ ఫోటో ను ఉంచితే మరింత ప్రయోజనం ఉంటుంది. కొన్ని ఫోటోలలో ఏడు గుర్రాలు వేరే దిశల్లోకి వెళ్తున్నట్టు ఉంటాయి, అటువంటి ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు. అన్ని గుర్రాలు ఒకే దిశలో వెళ్తున్నట్టు చూసుకోవాలి.

పైగా వాటి ముఖం ఇంటి బయట వైపు ఉండకూడదు, కేవలం ఇంటి లోపల వైపే ఉండే విధంగా చూసుకోవాలి. ఈ గుర్రాల ఫోటో ను లివింగ్ రూమ్ లో కచ్చితంగా ఉంచాలి. కాకపోతే పడుకో గదిలో ఈ ఫోటో ను అసలు పెట్టకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలను తగ్గించుకోవాలంటే ఏడు గురాళ్ల ఫోటో ను ఇంట్లో తప్పకుండా పెట్టాలి. దీనివలన లక్ష్మీ కటాక్షాన్ని పెంచుకోవచ్చు మరియు ఇంట్లో కుటుంబ సభ్యులు మధ్య ప్రేమ, అనురాగం కూడా పెరుగుతాయి. కనుక ఈ వాస్తు చిట్కాలను పాటించి మంచి ఫలితాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news