సరైన నిద్ర లేకపోవడం వలన.. ఎదురయ్యే దీర్ఘకాలిక సమస్యలు ఇవే..!

-

పూర్తి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకున్నా సరే, మంచి నిద్రను కూడా పొందాలి. ఎప్పుడైతే సరైన నిద్రను పొందరో, ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. ప్రతిరోజు మంచి నిద్ర ను పొందకపోతే, దీర్ఘకాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువవుతుంది మరియు నిద్రను నిర్లక్ష్యం చేయడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాత్రి ఆలస్యంగా పడుకోవడం, లేక మొబైల్ ఫోన్‌లో సమయాన్ని గడపడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీనివలన పగటి పూట నిద్రమత్తుగా అనిపించడం లేక పనిచేస్తున్నప్పుడు అలసిపోవడం, మరియు నిద్రపోవాలని అనుకోవడం వంటివి జరుగుతాయి.

ఇటువంటి లక్షణాలు కనిపిస్తే, నిద్రలేమి సమస్య తీవ్రమైందని గమనించాలి. నిద్రలేమి సమస్య వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతిరోజు కనీసం ఆరు గంటలు నిద్రపోవడం ఎంత అవసరం. నిద్రలేమి వలన రక్తపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా గుండె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు వలన జీవక్రియ కూడా దెబ్బతింటుంది. దీంతో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో నిద్రలేమి సమస్య స్లీప్‌ ఎప్నియా కు గురిచేస్తుంది. దీని వలన మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది.

అంతేకాకుండా ఊబకాయం ఉండే వారిలో ఈ సమస్య ఎదురైతే, కండరాలు బలహీనంగా ఉండడం వలన ఆక్సిజన్ స్థాయిలు తక్కువ అవుతాయి. దీంతో నరాలకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ విధంగా పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య వలన ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా హార్మోన్ల వ్యవస్థ దెబ్బతినడం వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఈ విధంగా సరైన నిద్ర లేకపోవడం వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి.

Read more RELATED
Recommended to you

Latest news