పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. మాట తప్పడం నేరం కాదు….!

-

 

పెళ్లి హామీ ఉల్లంఘన నేరం కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానన్న హామీని నెరవేర్చకపోవడం క్రిమినల్ చర్య కిందకు రాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ వ్యక్తిపై నమోదు అయిన కేసును హైకోర్టు కొట్టేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరకు చేసుకోకుండా మోసం చేశారని జీవన్ రెడ్డి అనే వ్యక్తిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

telangana high court on marriages
telangana high court on marriages

దీంతో జీవన్ రెడ్డిపై ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. దీనిని ఆ వ్యక్తి సవాల్ చేయగా…. విచారించిన కోర్టు వివాహ హామీని ఉల్లంఘించినందుకు మోసం కేసును కొనసాగించలేమని స్పష్టం చేసింది. అనంతరం జీవన్ రెడ్డిపై ఉన్న కేసును హైకోర్టు కొట్టి వేసింది. వివాహ హామీ నెరవేర్చకపోవడం క్రిమినల్ చర్య కిందికి రాదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో కొంతమంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news