తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో విద్యా సంస్థలకు జూలై నెలలో ఏడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. 5వ తేదీన మొహర్రం ముందు రోజుగా ఆప్షనల్ హాలిడే, 6న ఆదివారం మరియు మొహర్రం సెలవు ఉంది.

జూలై నెలలో 12న రెండో శనివారం, 13న ఆదివారం, 20వ తేదీన ఆదివారం, 21న బోనాల సెలవు, 27న ఆదివారంతో కలిపి జూలై నెలలో ఏడు రోజుల సెలవులు విద్యార్థులకు వస్తున్నాయి. తెలంగాణలో బోనాల పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు 21వ తేదీన బోనాల పండుగ సెలవు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోనాల పండుగ మినహాయించి విద్యార్థులకు ఆరు రోజుల సెలవులు ఉండనున్నాయి. దీంతో విద్యార్థులు సెలవులు రావడంతో సంతోషపడుతున్నారు.