Actress Pakeezah: మీ కాళ్లు పట్టుకుంటా ఆదుకోండి..

-

Actress Pakeezah:  నటి పాకీజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నటి పాకీజా రెండు రోజుల క్రితం తాను చాలా కష్టాల్లో ఉన్నానని తనను ఆదుకోవాలంటూ కోరింది. తమిళ సినీ పరిశ్రమ తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నన్ను ఆదుకోవాలని పింఛన్ డబ్బులు వచ్చేలా చేయాలని కోరింది. తన వద్ద ఉన్న డబ్బు అంతా తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసమే ఖర్చు చేశానని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నటి పాకీజా మరోసారి కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

PAAKIJA
PAAKIJA

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను ఆదుకోవాలంటూ పాకీజా వీడియోను షేర్ చేశారు. చాలా కష్టాల్లో ఉన్నానని మూడు సంవత్సరాల నుంచి సినిమా షూటింగ్ లు లేకుండా ఉన్నానని చెప్పింది. అన్నింటినీ వదిలేసి చెన్నై నుంచి సొంతూరికి వచ్చానని పాకీజా అన్నారు. రెండు సార్లు విజయవాడకు కూడా వచ్చాను. కానీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవలేకపోయాను. మీ కాళ్లు పట్టుకుంటా దండం పెడతాను నన్ను ఎలాగైనా ఆదుకోండి. నాకు భర్త, పిల్లలు లేరు. ఏపీ తరఫున ఏదైనా సహాయం చేయండి అంటూ పాకీజా కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. ఈ విషయం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news