ఈ మధ్యకాలంలో వాహనాల నుండి వచ్చే పొగ మరియు ఇతర కారణాల వలన కాలుష్యం చాలా ఎక్కువ అయింది అనే చెప్పవచ్చు. కాలుష్యం వలన కేవలం పర్యావరణం దెబ్బతినడం మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. కనుక కాలుష్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే వాయు కాలుష్యం, పర్యావరణ కాలుష్యం ఎక్కువ అవుతుందో, ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కేవలం బయటకు వెళ్లడం వలన మాత్రమే కాకుండా, ఇండోర్ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఈ రెండింటి వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అయింది. కాలుష్యం వలన ఎన్నో ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలు పర్యావరణంలో ఉంటాయి. అటువంటి ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి క్యాన్సర్ కు దారి తీస్తాయి. ఈ విధంగా వాయు కాలుష్యానికి దీర్ఘకాలికంగా గురైతే, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. కనుక ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే, కాలుష్య నిరోధక మాస్కులను తప్పకుండా ధరించాలి. అంతేకాకుండా, కారులో ఉండే ఎయిర్ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రతిరోజూ ప్రయాణించాల్సి వస్తే, రద్దీ తక్కువ ఉండే మార్గాలను ఎంచుకోవడం లేదా సరైన సమయంలో ప్రయాణించడం వంటివి చేయాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో అయితే ఇంట్లో కూడా గాలి నాణ్యతను మెరుగుపరిచే ఎయిర్ ప్యూరిఫైయర్లను పెట్టుకోవాలి. వీలైనంతవరకు కాలుష్యానికి దూరంగా ఉండి, తగిన జాగ్రత్తలను తీసుకోవడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ క్యాన్సర్‌కు సంబంధించిన ప్రమాదం తగ్గించుకోవాలంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి.