లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను హత్య చేసి, రెండు రోజులు మృతదేహం పక్కనే నిద్రించాడు ఓ యువకుడు. మధ్యప్రదేశ్ భోపాల్ లో రితికా సేన్(29) అనే యువతితో గత నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు సచిన్ రాజ్‌పుత్ (32) అనే యువకుడు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న సచిన్.. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు రితికా సేన్.

రితికా సేన్ ఇతరులతో సంబంధం పెట్టుకుందని తరచూ అనుమానించిన క్రమంలో, జూన్ 27న వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో యువతిని గొంతు నులిమి చంపేసాడు సచిన్. హత్య చేశాడనే భయంతో మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, రెండు రోజులు మృతదేహం పక్కనే మద్యం సేవిస్తూ నిద్రించాడు సచిన్. జూన్ 29న మద్యం మత్తులో హత్య విషయాన్ని తన స్నేహితుడు అనూజ్‌కు చెప్పడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.