చాణక్య నీతి: జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేని వారు వీళ్లే..!

-

జీవితంలో ప్రతిరోజు ఎన్నో మంచి విషయాల గురించి వింటూ ఉంటాము. అయితే వాటిని పాటించడం వలన మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అదే విధంగా ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో ఎన్నో మంచి నియమాలను తెలియజేశాడు. ముఖ్యంగా జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి మరియు ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఎలా జీవించాలి అనే మొదలైన విషయాల గురించి చెప్పడం జరిగింది. అటువంటి నియమాలను పాటించడం వలన ఎంతో ఆనందంగా జీవిస్తారు. చాలా శాతం మంది అనేక కారణాల వలన జీవితాంతం దుఃఖంతో ఉంటూ ఉంటారు. అయితే అటువంటి వారి కోసం చాణక్యుడు ఎంతో మంచి విషయాలను చెప్పాడు.

జీవితాంతం అసంతృప్తిగా ఎప్పుడూ ఉండకూడదు. కాకపోతే కొంతమంది జీవితాంతం దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ అప్పులు తీసుకుంటారో వారు అస్సలు ఆనందంగా ఉండరు. జీవితాంతం అప్పులను తీర్చడానికే సమయాన్ని గడుపుతారు. దీంతో విజయాన్ని కూడా సాధించలేరు. సహజంగా తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచుతూ ఉంటారు. ఎప్పుడైతే కొడుకు లేక కూతురు సరిగ్గా ప్రవర్తించరో, అటువంటి వ్యక్తులు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటారు. ముఖ్యంగా జీవితాంతం పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు కూడా జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు.

అంతేకాకుండా నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తులు కూడా జీవితాంతం దుఃఖంతో ఉండాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పేటువంటి స్త్రీలు కూడా జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ముఖ్యంగా అటువంటి స్త్రీలు కుటుంబంలో సమస్యలను తీసుకువస్తారని చాణక్యుడు చెప్పాడు. అందువలన అబద్ధాలు చెప్పేటువంటి మహిళలు కూడా జీవితాంతం దుఃఖంతో ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడైతే స్త్రీల ప్రవర్తన సరిగా ఉండదో, అటువంటి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడూ అశాంతిగా ఉంటారు. దాని వలన జీవితాంతం ఎంతో పరువు నష్టంతో జీవిస్తారు. ముఖ్యంగా ఎటువంటి ఆనందం కూడా వారి జీవితంలో ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news