తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి-చేర్యాల గుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్. సంగారెడ్డి పట్టణంలోని చాణక్యపురి కాలనీకి చెందిన రాజేశ్వర్.. ఫిల్మ్ నగర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహించి తిరిగి వెళ్తుండగా చేర్యాల గుట్ట వద్ద ప్రమాదం జరిగింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.