ఆకస్మిక మరణాలకు కారణం కోవిడ్ వ్యాక్సిన్ కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండె సమస్యలతో ఒకే నెలలో 23 మంది చనిపోవడానికి కారణం కోవిడ్ వ్యాక్సిన్ అని సిద్ధరామయ్య చేసిన ఆరోపణలపై స్పందించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని, ఇతర సమస్యల కారణంగా ఆకస్మికంగా గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కొవిడ్ అనంతరం తలెత్తిన సమస్యలే ఆకస్మిక మరణాలకు కారణం అవ్వొచ్చని స్పష్టం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. 18-45 ఏళ్ల వయసున్న వారిలో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కోవిడ్ వ్యాక్సిన్ పెంచలేదని పలు పరీక్షల్లో తేలిందని తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.