వెంటిలేటర్ పై ఫిష్ వెంకట్ ఉన్నారు. ఈ తరుణంలోనే ఆర్ధిక సాయం కోసం వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఫిష్ వెంకట్. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో.. చికిత్స ఖర్చులు భరించలేక దాతల సహాయం కోరుతున్నారు కుటుంబ సభ్యులు.

మీడియా ద్వారా “దయచేసి మా ఫ్యామిలీని ఆదుకోండి” అంటూ ప్రజలకు, సినీ ప్రముఖులకు వేడుకుంటున్నారు ఆయన భార్య, కూతురు. గతంలో రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసి ఫిష్ వెంకట్‌కు అండగా నిలిచారు పవన్ కళ్యాణ్.