తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త అందజేసింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలోని పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.

త్వరలోనే టీజీపీఎస్సీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పాఠశాల విద్యాశాఖ పరిధిలోను 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలియజేసింది. త్వరలోనే ఈ విషయం పైన మరింత సమాచారం వెలువడనుంది.