ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అనేది. అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు మరో ఏడాది కాలం పాటు ఉచిత బస్స సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

11 సంవత్సరాలుగా అమరావతి ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత బస సదుపాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీన్ని మరో ఏడాది ఈ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ అలాగే హైకోర్టు, రాజ్ భవన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మరో ఏడాది పాటు వసతి సౌకర్యం కల్పించేందుకు… నిర్ణయం తీసుకుంది. తాజాగా జూన్ 27వ తేదీ తో గడువు ముగియడంతో 2026 జూన్ 26 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.