వాహనాలు కొనుగోలు చేసే వారికి శుభవార్త. ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీతో రూ. 65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను రూ. 8 లక్షలకే అమ్ముతున్నారు. రూ. 40 లక్షల మెర్సిడెజ్ సి క్లాస్ 220 సిడిఐ స్పోర్ట్స్ లిమిటెడ్ కారును నాలుగు లక్షలకే అమ్మి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు ఓ వ్యక్తి. వీరు మాత్రమే కాకుండా రాష్ట్రంలో మరికొంతమంది వాహనా దారులు వారి కార్లను నామమాత్రపు రేట్లకు విక్రయిస్తున్నారు.
ఈ విషయం తెలిసి కొంతమంది వాహనాలు కొనుగోలు చేయడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే తక్కువ ధరకే వాహనాలు వస్తాయని ఆలోచనలు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఈ విషయాన్ని ముందుగానే చెబితే తాము కార్లను చౌకగా అమ్ముకునే పరిస్థితి వచ్చేది కాదని వాహనా దారులు వాపోతున్నారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం అక్కడ విపరీతంగా కాలుష్యం జరుగుతోంది. పాత వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువగా జరుగుతోందని ఈ నిర్ణయం తీసుకున్నారు.