రేవంత్ రెడ్డిని ముందు కొడంగల్లో జడ్పీటీసీలను గెలిపించుకోమను అంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు, 15 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

నల్లమల పులి అంటాడు.. మళ్లీ నల్లమల తెలంగాణలోనే ఉందా అని అంటాడు. ఇంత నికృష్టమైనోడని రేవంత్ రెడ్డిపై చురకలు అంటించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు వెయ్యడు.. రైతులకు ఎకరానికి రూ.15 వేలు, మూడు పంటలు వేస్తానని అన్నాడు.. ఎవరికైనా పడ్డాయా? అని చురకలు అంటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేశాడు.. ఎన్నికలు అయిపోయాక రైతుబంధుకు రాం రాం అన్నారు. నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టాడు అంటూ నిప్పులు చెరిగారు.
వందనా..వాని బొంద! 😄 pic.twitter.com/BpN1Z50Vwp
— Gowtham Pothagoni (@Gowtham_Goud6) July 5, 2025