పవన్ కళ్యాణ్, బాలకృష్ణపై సంచలన కామెంట్లు చేశారు వైసిపి నేత రోజా సెల్వమణి. వివరాల్లోకి వెళితే…. వైసిపి నేత రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టిడిపి, జనసేన నేతలకు ఎంత మగ అహంకారం అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లారంటూ ప్రశ్నించారు. వారు ప్రజా సమస్యలపై ఎన్ని సార్లు పోరాడారు? ఎంతమంది ప్రజల సమస్యలను తీర్చారు? నేను ఎలాంటి అభివృద్ధి పనులు చేశాను చెప్తాను.

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సిద్ధంగా ఉన్నారా? నేను జబర్దస్త్ లో జడ్జిగా చేస్తే తప్పు అయినప్పుడు వారు మాత్రం షూటింగ్ లలో ఎలా పాల్గొంటారు. షూటింగ్స్ చేసుకోవడానికి ప్రజలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేశారా? నన్ను అన్నప్పుడు వారు ఎలా చేస్తారు. నేను చేస్తే తప్పు అయితే వారు చేస్తే తప్పు కాదా అంటూ వైసీపీ నేత రోజా మండిపడ్డారు. ప్రస్తుతం రోజా మాట్లాడిన ఈ మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.