ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. QR కోడ్ తో వివరాలు అన్నీ తెలిసేలా పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను ఆగస్టు నెలలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారుల ఫోటోలు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంది.

1. 46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా రెండు లక్షల కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది. ఇదిలా ఉండగా…. రైతులకు కూడా ఆగస్టు నెల నాటికి కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క రైతుకు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ తో పాటు ఆధార్ కార్డు ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టారు.