కోరుట్లలో దారుణం జరిగింది.. 5 ఏళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేశారు. కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి…గొంతు కోసి హత్య చేశారు. కొంతసేపటికి అదే కాలనీలోనీ ఓ ఇంటి బాత్రూంలో రక్తం మడుగులో పడి ఉంది చిన్నారి.

ఇక ఘటనాస్థలికి చేరుకుని విచారిస్తున్నారు పోలీసులు. చిన్నారిని అదే ప్రాంతానికి చెందిన సైకో విజయ్ గొంతు కోసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.