అల్లూరి జిల్లాలో విషాదం నెలకొంది. అల్లూరి జిల్లాలో తల్లి, కుమార్తె పెట్రోల్ పోసుకొని మృతి చెందారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణపల్లి తోటలూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. భార్య భర్తలు తగాధలతో తల్లి, కుమార్తెలు ప్రక్కనే ఉన్నా జీడిమామిడి తోటలోకి వెళ్లి పెట్రోల్ పోసికొని ఆత్మహత్య చేసుకుంది.

స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లగా తల్లి మౌనికను, కుమార్తె లాస్యశ్రీని కొయ్యూరు హాస్పటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో ఒకరు.వైజాగ్ కేజీహెచ్ కు మరొకరు తరలించగా ఇద్దరు మృతి చెందారు. మరణాలకు కారణం ఇంట్లోని మనస్పర్ధలే కారణమని అంటున్నారు స్థానికులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.