తెలుగుదేశం పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. వైసిపి పార్టీ…. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి 2.0 సినిమా మొదలవుతుందని హెచ్చరించారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలకు రప్పా..రప్పా సినిమా చూపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీనికోసం ప్రతి వైసీపీ కార్యకర్త ఒక బుక్కు తెరవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఆదివారం జరిగిన కడప నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. అయితే దీనికి టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.