తోడు కోసం వివాహం చేసుకుంటే రూ. 28 కోట్లతో పారిపోయాడు యువకుడు. రోజురోజుకో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. నేటి కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని పెద్దలు వివాహం చేస్తుంటే వారు హత్యలు చేసుకోవడం మోసం చేయడం చాలా కామన్ అయిపోయింది. తాజాగా ఏపీలో మరో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో తన భర్త, కుమారుడిని కోల్పోయింది.

ఈ క్రమంలోనే తోడు కోసం వివాహం చేసుకోవాలని పెళ్లి బ్రోకర్ కు ప్రకటన ఇచ్చింది. దీంతో శేషాపురానికి చెందిన శివప్రసాద్ (40) గతంలో తన భార్య కరోనాతో మరణించిందని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. బెంగుళూరులో నాగమణికి చెందిన రూ. 10 కోట్ల విలువైన భూమి, రూ. 15 కోట్ల విలువైన అపార్ట్మెంట్ తీసుకోవడంతోపాటు రూ. 3 కోట్ల నగదు తీసుకొని పారిపోయాడు. దీంతో నాగమణి పోలీసులకు సమాచారం అందించగా శివప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.