దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అలాగే చాలా విద్య సంస్థలలో ర్యాగింగ్లు కూడా చేస్తున్నారు. సీనియర్ల పేరుతో.. జూనియర్లను వేధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. యు జి సి కీలక ప్రకటన చేసింది. వాట్సప్ గ్రూపులలో వేధించిన కూడా ర్యాగింగ్ చేసినట్లేనని తేల్చి చెప్పింది యు జి సి.

ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. విద్యా సంస్థలలో కొత్తగా చేరిన విద్యార్థులను వాట్సప్ గ్రూపులలో కించపరిచే విధంగా మాట్లాడిన కూడా అది ర్యాగింగ్ అవుతుందని.. ర్యాగింగ్ లాగానే పరిగణించాలని యూజీసీ తేల్చి చెప్పింది. అదే సమయంలో రాగింగ్ చేసిన వారిపై ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.