మ‌రో కొత్త వివాదంలో TDP ఎమ్మెల్యే చింత‌మ‌నేని !

-

టిడిపి పార్టీ వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని వేగంగా బుల్లెట్ బైక్ పైన వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హెల్మెట్ పెట్టుకోకుండానే బైక్ డ్రైవ్ చేశారు. అయితే ఈ వీడియో వైసిపి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

TDP MLA Chintamaneni Prabhakar in another new controversy
TDP MLA Chintamaneni Prabhakar in another new controversy

టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన పని… మోటార్ వాహనాల చట్టం ఉల్లంఘించడమేనని… వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలపై ఏపీ పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్టం సరిగ్గా మలుగు కావడంలేదని ఏపీ హైకోర్టు ఆగ్రహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైసీపీ లీడర్లు.

Read more RELATED
Recommended to you

Latest news