ఇవాళ చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను ఈ సందర్భంగా పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో… వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ప్రభాస్ ఫోటో దర్శనమిచ్చింది.

చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్… జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రభాస్ ఫోటోను… తీసుకువచ్చి రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు YS జగన్ ప్రయత్నం చేశారు. YSRCP శ్రేణులను పోలీసులు కొట్టారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు. గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వైఎస్ జగన్ వెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ను కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్నారు ఎస్పీ మణికంఠ.
జగన్ గారి పర్యటనలో ప్రభాస్ ఫోటో ✨ pic.twitter.com/0TILgPHnef
— Rahul (@2024YCP) July 9, 2025