రూ.750 కోట్ల స్కాం బయట పెట్టిన గంగుల కమలాకర్ !

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బయట పెట్టారు. దళారుల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావల్సిన రూ.750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

BRS MLA Gangula Kamalakar exposes scam in Civil Supplies Department
BRS MLA Gangula Kamalakar exposes scam in Civil Supplies Department

90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయాలి, కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు? అని నిలదీశారు.  పౌర సరఫరాల శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ కుంభకోణాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున ఈడీ, ఎఫ్‌సీఐ, సీబీఐ, డీఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ లాంటి అన్ని కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

 

Read more RELATED
Recommended to you

Latest news