నేడు తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం జరుగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల శాశ్వత పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ కేబినెట్ భేటీ లో చర్చ జరుగనుంది.

NDSA నిపుణుల బృందం సమర్పించిన తుది నివేదికపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీని ఆమోదించనుంది కేబినెట్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉంది.