ఏపీలో త్వరలోనే మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరసాపురం – చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బుధవారం స్పష్టం చేశారు. నరసాపురం రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో నరసాపురం – అరుణాచలం ప్రత్యేక రైలును భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు.

ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి మరో వందే భారత్ రైలును త్వరలోనే తీసుకు వస్తామని స్పష్టం చేశారు. వందే భారత్ ట్రైన్ లో టికెట్ల చార్జీలు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా తక్కువ సమయంలో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. బిజీ లైఫ్ కారణంగా పరుగులు తీసే జనాలు వందే భారత్ రైలులో తొందరగా చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు సెలవులలో ఇంటికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్నారు.