తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందజేసింది టీటీడీ సంస్థ. భక్తుల కోసం బిగ్, జనతా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించాలని టిటిడి ఈవో అధికారులకు సూచనలు జారీ చేశారు. హోటల్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించిన అనంతరం నాణ్యత పరిశుభ్రతపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరారు. తక్కువ ధరలకే భక్తులకు భోజనం అందించాలని తెలియజేశారు. ఈ మేరకు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై హోటళ్ల నిర్వాహకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరోవైపు శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసాయి. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా… మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడే అవకాశం ఉందని ఆలయ అధికారులు వెల్లడించారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 76,501 మంది భక్తులు దర్శించుకోగా, 29,033 మంది తరనీలాలు సమర్పించారు. రూ. 4.39 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టుగా టీటీడీ సంస్థ స్పష్టం చేసింది.