హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ మహానగరంలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్లో బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ బంద్ చేయబోతున్నట్లు అధికారులు ప్రకటన చేశారు.

13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్ అలాగే వేస్ట్ హైదరాబాద్లో వైన్స్ తో పాటు బార్లు కూడా బంద్ కానున్నాయి. అంటే రెండు రోజులపాటు ఈ బంద్ కొనసాగనుంది. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో యధావిధిగా మద్యం దుకాణాలు ఓపెన్ గానే ఉంటాయి.