మల్నాడు డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ దందాలో నైజీరియా యువతులు ఉన్నారు. మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేసింది ఈగల్ టీమ్. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో డ్రగ్స్ సప్లై జరుగుతోంది. ఏపీకి చెందిన ప్రముఖ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ ఇప్పటి వరకు 20 సార్లు డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ చేరవేసేందుకు వెయ్యి, విక్రయించినందుకు రూ. 3 వేలు కమీషన్ ఇస్తున్నాడట సూర్య. ఇక సూర్యను వారం రోజులు కస్టడీకి కోరిన నార్కోటిక్ బ్యూరో అధికారులు… కీలక విషయాలు రాబట్టారు. నైజీరియా యువతలకు కమీషన్ ఆశ చూపించి డ్రగ్స్ దందా, వ్యభిచారం చేయిస్తున్నట్లు నార్కోటిక్ బ్యూరో విచారణలో వెల్లడించాడు. బెంగళూరు, ముంబై, ఢిల్లీలో 60 మంది నైజీరియా యువతులు ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.