పాకిస్తాన్ లో దారుణం. పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ లోని సాయుధ దుండగులు బస్సును అడ్డుకొని తొమ్మిది మంది ప్రయాణికులను దారుణంగా కాల్చి చంపారు. గురువారం సాయంత్రం ఈ దారుణమైన ఘటన జరిగింది. సమీప పర్వతాల్లో రాత్రి సమయంలో మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఎవరు అనే విషయాలు ఇప్పటివరకు వెలువడలేదు.

ఇదిలా ఉండగా….జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల 18 మంది టూరిస్టులను పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. దీంతో 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది మోడీ ప్రభుత్వం. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు యుద్ధం జరిగిన అనంతరం శాంతి చర్చలు జరిగాయి. దీంతో యుద్ధం ఆగిపోయింది.