టీటీడీ దేవస్థానంలో 1000 మందికి పైగా ఇతర మతస్తులు ఉన్నారు.. వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదని వెల్లడించారు. వారికి స్వామి వారి మీద విశ్వాసం, నమ్మకం లేదు.. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదని పేర్కొన్నారు.

అలాంటి వాళ్లకు టీటీడీలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు.. వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యాగాల్లో కొనసాగుతున్నారని వెల్లడించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు అణా సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడమేంటి? కొనసాగించడమేంటి? అని నిలదీశారు. ఇతర మతస్తులు ఉండడం వల్ల ఆచార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడుతాయి… ఈ పద్దతి మంచిది కాదు.. దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు.