ప్రధాని నరేంద్ర మోడీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఇవాళ ఒక్కరోజే 51 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాలు, సంస్థలలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ.. నియామక పత్రాలు అందజేయబోతున్నారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు 16వ రోజ్ గార్ మేళాలో భాగంగా 51 వేల మందికి వర్చువల్ గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియన్ వ్యాప్తంగా మొత్తం 47 ప్రాంతాలలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. హోం మంత్రిత్వ శాఖ, పోస్ట్ ఆఫీస్, రైల్వే విభాగాలలో భర్తీ అయిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇలాంటి కార్యక్రమాలను మొత్తం పది లక్షల మందికి నియామక పత్రాలు ఇచ్చింది మోడీ ప్రభుత్వం.