తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధికి వేలాది సంఖ్యలో వస్తున్నారు. దీంతో.. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ తరుణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టికెట్లు లేని భక్తులకు శ్రీ వారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని అధికారికంగా ప్రకటన చేశారు అధికారులు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారని కూడా వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 70 వేలకు పైగా మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 31 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారని… పేర్కొన్నారు. దీంతో నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్లుగా నమోదు అయింది. ఇవాళ అలాగే రేపు హాలిడేస్ కావడంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.