ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..మరో కొత్త నేషనల్ హైవే రానుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేటలోని పోర్టు నుంచి భీమిలి వరకు నేషనల్ హైవే అందుబాటులోకి రాబోతోంది. ఈ కోస్టల్ హైవే అవసరంపై ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి గడ్కరి ఆమోదం తెలియజేశారు.

ఆరు లైన్లను 200 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ హైవే అందుబాటులోకి వచ్చినట్లయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య మార్గం పూర్తిగా తగ్గుతుంది. త్వరలోనే డిపిఆర్ ను సిద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటు ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లో నిర్మించాలని చూస్తున్న డ్రై పోర్టు నుండి మచిలీపట్నం పోర్టుకు రైలు మార్గం గురించి ప్రతిపాదన పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఇటీవల సమావేశం నిర్వహించింది కేంద్ర హోం శాఖ.