ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి నటుడు ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేశారు. హిందీ రాజ్యభాష అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. “ఈ రేంజ్ కి అమ్ముకోవడమా? ఛి… ఛీ…#justasking” అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను ప్రకాష్ రాజ్ షేర్ చేసుకున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ ను కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా, ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడినా ప్రకాష్ రాజ్ ఏదో ఒక విధంగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక విధంగా రియాక్ట్ అయ్యే ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.